- Advertisement -
బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. ఏ సినిమా ఆడియో రిలీజైనా…ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సుమ యాంకరింగ్ చేయాల్సిందే. ఇక 1999లో రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న సుమకు ఇద్దరు పిల్లలు రోషన్, మనస్విని న్న సంగతి తెలిసిందే.
ఆదివారం తన కొడుకు రోషన్ బర్త్ డే సందర్భంగా ఫోటోను షేర్ చేసింది సుమ. నా ప్రియమైన రోషన్ పెద్దవాడయ్యాడు. దృఢంగా తయారయ్యాడు. లవ్ యు రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు సుమ.
ఈ ఫొటోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. రోషన్ చూడటానికి అచ్చం సుమలానే ఉన్నాడని అంటున్నారు. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించారు రోషన్. అప్పటికి రోషన్ కాస్త చిన్న పిల్లాడు. కానీ, ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు.
- Advertisement -