పవన్‌ మూవీలో నాగ్‌ హీరోయిన్‌..!

444
Lavanya Tripathi
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హిందీ పింక్‌ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. తెలుగులో ఈ మూవీకి ‘వకీల్‌ సాబ్‌’ పేరుతో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా నుండి పవన్‌ ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ మూవీ ష్యూటింగ్‌ చివరిదశలో ఉంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నివేద థామస్, అనన్య, అంజలి నటిస్తున్నారు. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Vakeel Saab

తాజాగా ఈ మూవీలో మరో కీలక పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సాంగ్స్, ఫైట్స్‌తో పవన్‌ను ఓ రేంజ్‌లో చూపిస్తున్నరనే వార్తలు వస్తున్నాయి. పవన్‌కి జోడీగా ముందుగా శృతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది.

అయితే ఆమె ప్లేస్‌ను ఇలియానాతో రీ ప్లేస్ చేసినట్టుగా ప్రచారం నడుతస్తున్న సందర్భంలో ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు అనేది మరో హాట్ టాపిక్. అంతేకాదు వవన్‌కి సెకండ్ హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారని.. ఆమెకు ‘వకీల్ సాబ్’ నుంచి పిలుపు రావడంతో షూటింగ్‌కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

- Advertisement -