మొబైల్ కొనుగోలుదారులకు షాక్

458
new Mobiles
- Advertisement -

కొత్తగా మొబైల్ కొనుక్కునేవారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది కేంద్రప్రభుత్వం. మొబైల్‌ ఫోన్లపై గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ఏడాదికి రూ.5 కోట్ల కంటే ఎక్కువగా వ్యాపార లావదేవీలు నిర్వహించే కంపెనీలు జీఎస్టీ తప్పనిసరిగా ఫైల్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఈ లిమిట్ రూ.2కోట్లు ఉండేది. అలాగే డెడ్ లైన్ కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో ఎరువులు, ఫుట్ వేర్ మీద జీఎస్టీ పెంచకూడదని నిర్ణయించింది.

- Advertisement -