కరోనాపై అప్రమత్తం..భయాందోళన వద్దు: సీఎం కేసీఆర్

353
cm kcr
- Advertisement -

కరోనాపై జాతీయ,అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్..కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర హైలెవల్ కమిటీ సమావేశంతో పాటు కేబినెట్ సమావేశం జరగనుందని తెలిపారు.

కరోనా అరికట్టేందుకు అవసరం అయితే 5వేల కోట్లు ఖర్చుచేస్తాం అని తెలిపిన సీఎం..ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపై కూడా సమీక్ష చేస్తాం,కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం అన్నారు.

దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటని…శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో రద్దీఎక్కువగా ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో ఇద్దరు చనిపోగా   66 మందికి చికిత్స అందుతుందన్నారు. ఇందులో 17 మంది విదేశీయులేనని చెప్పిన సీఎం.. చరిత్రలో కరోనాలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయని తెలిపారు.

కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారికి అన్నిటెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. జాతీయ,అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు సీఎం.

- Advertisement -