బీసీల దేవుడు సీఎం కేసీఆర్: ఉపేంద్ర

472
upendra
- Advertisement -

వెనుకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినందుకు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేంద్ర ..సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంచాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యమని దానికి అనుగుణంగానే చెరువులలో చేప పిల్లల పెంపకం ద్వారా తెలంగాణలో ముదిరాజ్‌లకు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించారని తెలిపారు. గొర్రె పిల్లలను యాదవులకు ఇవ్వడం ద్వారా యాదవుల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి ఉపయోగపడిందన్నారు.

నేత,గీత కార్మికులకు పెన్షన్ ఇవ్వడం,ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం ద్వారా వారి ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతుందన్నారు. బీసీ హాస్టల్స్‌లో చదువుకొనే విద్యార్ధులకి ఒక్కరిపై లక్షా 16 వేలు ఖర్చు పెట్టి నాణ్యమైన ఆహారం,విద్య కొరకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. బీసీ విద్యార్థులు ఇతర దేశాల చదువుల కొరకు 20 లక్షలు ఇస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులకు ఇంటర్,డిగ్రీ స్ధాయిలో గురుకుల పాఠశాలలు,కాలేజీలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని చదువుకొనే పేదవారికి ప్రత్యేక పాఠశాలలు,కాలేజీలు నిర్మిస్తున్నారని అన్నారు.

రాజకీయంగా మార్కెట్‌ కమిటీల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించిన దేశంలోనే మొదటి సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపల్,సహకారా ఎన్నికల్లో 50 శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. బడ్జెట్‌లో బీసీలకు ప్రత్యక్షంగా 4,356 కోట్లు,ఎంబీసీలకు 500 కోట్లు బీసీ,ఎంబీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

హైదరాబాద్‌ లాంటి నగరంలో అంబేద్కర్,మహత్మా పూలే లాంటి వారి విగ్రహాలను దేశం గర్వించే రితీలో నిర్మిస్తున్నందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీ విద్యార్థుల కోసం పాఠశాలలు,కళాశాలలు,షాది ముబారక్‌ లాంటి పథకాలను తీసుకొచ్చారని చెప్పారు.కళ్యాణలక్ష్మీద్వారా పేద వారికి న్యాయం జరుగుతుందన్నారు.

- Advertisement -