ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం: పువ్వాడ

315
puvvada ajay
- Advertisement -

సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆర్టీసీని లాభాలబాట పట్టిస్తామని తెలిపారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని చెప్పారు.

ఆర్టీసీ సమ్మె ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరిందని..మార్చ్ 31 వ తేదీ లోగా సమ్మె కాలం జీతభత్యాలు ఇస్తాం అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. సమ్మె కాలం జీతభత్యాలకు గాను 235 కోట్ల రూపాయలు విడుదలను ఆర్ధిక శాఖ విడుదల చేసిందన్నారు.

ఈ నిధులు ఒకే దఫా లో విడుదల చేసి 2,3 రోజుల్లోనే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసు తోని ఆర్టీసీ ఉద్యోగులకు నిధులు మంజూరు చేశారని..ఆర్టీసీ కి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పినట్టుగానే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ ఉద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -