అధికారుల పనితీరుపై హరీశ్ అసహనం

321
harishrao
- Advertisement -

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో తడి- పొడి చెత్తను వేరు చేయడం ద్వారా అవగాహన కల్పించారు మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా గంజి మార్కెట్ – పాత చేపల మార్కెట్ సమీపంలో డంప్ యార్డును తలపించేలా చెత్త పొగైంది. దీంతో మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్ పని తీరు పై అసహనం వ్యక్తం చేశారు హరీశ్. వెంటనే ఆ ప్రాంతమంతా శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

చెత్తను వేరు చేయడంలో ప్రత్యేక చొరవ అవసరం అని… మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి ఇవ్వాలని వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేకువజాము నుంచే ప్రతి గంట గంటకు అప్ డేట్ ఉండాలని కౌన్సిలర్లకు సూచించిన హరీశ్….ప్రతి ఇంటింటా మార్నింగ్ వాక్ వార్డు బాటలో పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు.

- Advertisement -