నేడు మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్

361
india-vs Aus
- Advertisement -

ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ నేడు జరుగనుంది. అంతర్జాతియ మహిళా దినోత్సవం రోజున మహిళల ఫైనల్ మ్యాచ్ జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియా జట్లు తలపడనున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా తమ దేశ మహిళలకు వరల్డ్ కప్ గిప్ట్ గా ఇవ్వాలని ఇరుజట్ల టీంలు పట్టుదలతో ఉన్నాయి. వరుస విజయాలతో భారత్ దూకుడుమీదుంది.

ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే ‌ ఆసీస్‌‌కు షాకిచ్చిన టీంఇండియా అదే జోరుతో మిగతా మూడు మ్యాచ్‌‌లలో విజయం సాధించగా.. వర్షం కారణంగా ఇంగ్లండ్‌‌తో సెమీస్‌‌ రద్దు కావడంతో నేరుగా ఫైనల్లో అడుగుపెట్టి యమ జోరు మీదుంది. పిచ్ మాత్రం మొదట్లో బౌలర్లకూ తర్వాత బ్యాటర్లకూ అనుకూలంగా ఉంది. ఈసారి గెలిచిన జట్టుకు రూ.7.40 కోట్లు, రన్నరప్‌ టీమ్‌కు రూ.3.70 కోట్లు ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 12.30గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.

- Advertisement -