ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్,డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’.. కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు..లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ… యువత అంతా కలసి అవగాహనతో తీసిన సినిమా యురేక. డైరెక్టర్ కార్తిక్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ఇది, నేను ఈ సినిమా చూశాను, నచ్చి డిజిటల్ వారికి రెఫర్ చేశాను, మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నటీనటులు అందరూ బాగా నటించారు. ముఖ్యంగా సయ్యద్ సోహైల్ రియాన్ బాగా చేశాడు, డైరెక్టర్ కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ తనకు బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. సినిమా అంతా బాగుంది, మెయిన్ గా సెకండ్ హాఫ్ ను అద్భుతంగా ఉంటుంది. ఆర్కే గారు ఈ సినిమాలో మంచి రోల్ చేసాడు తనకు చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
డైరెక్టర్ కార్తిక్ ఆనంద్ మాట్లాడుతూ… కాలేజిలో జరిగే ఒక ఫంక్షన్ లో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది. ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అన్ని
కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమాను మార్చి 13న మా యురేక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మా సినిమా సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం కావాలి. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే ఎపిసోడ్స్ ను కెమెరామెన్ విశ్వ బాగా తీసాడు, మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ మంచి సాంగ్స్ తో పాటు బెస్ట్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. మా నిర్మాత ప్రశాంత్ తాత గారి సపోర్ట్ మరువలేనిది. నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరూ సహకరించడం వళ్ళే బెస్ట్ ఔట్ పుట్ వచ్చింది. నాతో పాటు నటించిన సయ్యద్, మహేష్ విట్ట లకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బెక్కం వేణు గోపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
హీరో సయ్యద్ సోహైల్ రియాన్ మాట్లాడుతూ… డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ నాకు మంచి రోల్ ఇచ్చారు. మంచి సినిమాలో నటించానన్న ఆనందం ఉంది. మార్చి 13న విడుదల కానున్న మా సినిమా చాలా బాగా
వచ్చింది. నిర్మాత ప్రశాంత్ గారు ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాడు, చిన్న సినిమాలకు అందరి సపోర్ట్ కావాలి. ఎన్నో ఇబ్బందుల్లో కూడా డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యురేక మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్న అన్నారు.
నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ… మా సినిమాను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన బెక్కెం వేణు గోపాల్ గారికి, మా సినిమాను ఆధరిస్తున్న అందరికి ధన్యవాదాలు, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది మా సినిమా మెయిన్ పాయింట్. ఒక మిస్టరీని డైరెక్టర్ కార్తిక్ బాగా చూపించారు, కాలేజ్ నేపథ్యంలో వస్తోన్న మా సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.