ఈనెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు

373
Telangana Assembly
- Advertisement -

శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీ(ఆదివారం)న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8న ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఈనెల 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనుండగా మొత్తం 12రోజులు సభ జరుగనుంది. ఈనెల 9,10,15 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. అవసరమైతే సమావేశాల నిడివి పొడిగించనున్నట్లు తెలిపారు. 20వ తేదిన 20 న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ కు ధన్యవాద తీర్మానం చేయనున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క్ లు హాజరయ్యారు.

- Advertisement -