- Advertisement -
తెలంగాణలో ఇవాళ్టీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఇంటర్మీడియట్ విద్యార్దులకు శుభాకాంక్షాలు తెలిపారు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
కాగా పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ర్టవ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
- Advertisement -