- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబు రష్మీక మందన జంటగా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈమూవీ విడుదలై 50రోజులు పూర్తైంది. మహేశ్ కెరీర్ లోనే ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈమూవీ 145కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే 121కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈమూవీకి హైలెట్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుంచి సూర్యుడివో చంద్రుడివో సాంగ్‌ను రిలీజ్ చేసారు. విజయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు ఉన్న ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ప్రరాక్ అద్భుతంగా పాడాడు. ఈసాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
- Advertisement -