కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..

557
ktr
- Advertisement -

రాష్ట్రంలో కరొన వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు అధిపతులు, ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింత గా పెంచాలి.గతంలో వచ్చిన ఇతర వైరస్ లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదన్న మంత్రులు.

ktr

కరోనా వస్తే చనిపోతారు అన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయి.పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్‌కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే పాజిటివ్ ప్రచారం నిర్వహించాలి. ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలి.హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లను ఏర్పాటు చేయాలని మంత్రుల సూచనలు చేశారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలి. కరోన వైరస్ పైన అసత్యాలను ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రులు పేర్కొన్నారు.

Elela

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రత్యేక ఆసుపత్రిని కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 9 డిపార్ట్మెంట్‌ల సమన్వయంతో పనిచేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్‌కి ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తామని మంత్రి తెలిపారు. ఊపిరితత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ను కూడా అప్రమత్తం చేస్తున్నాం. కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించండి అని కొరినం. ప్రజలకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత అని మంత్రి ఈటెల అన్నారు.

- Advertisement -