సైరా సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ని ఖరారు చేయగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే తన 153వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చిరు. రైటర్ ప్రసన్న కుమార్ ఇటీవలె చిరుని కలిసి ఓ యాక్షన్ డ్రామా సబ్జెక్ట్ చెప్పాడని. కథ నచ్చడంతో మెగాస్టార్ ప్రసన్న స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీటౌన్‌లో ప్రచారం జరగుతోంది.
తనతో ఠాగూర్,ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలను తెరకెక్కించిన వినాయక్ చేతిలో పెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి వినాయక్ కి కబురు కూడా వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది.