రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్. మూడు మొక్కలు నాటిన ప్రశాంత్ జీవన్ మరో ముగ్గురిని నల్గొండ జిల్లా ఎస్పీ , సూర్యాపేట జిల్లా కలెక్టర్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ని మొక్కలు నాటాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ భావితరాలకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆందోళనకి గురిచేస్తున్న సమస్య పర్యావరణ లో వచ్చే పెనుమార్పులు అని అందుకే సీఎం కేసీఆర్ 2014లో హరితహారం ప్రోగ్రాం చేపట్టారని తెలిపారు. ఒక 30 , 40 సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి వాతావరణంలోని మార్పులు వాటివల్ల వచ్చే పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని తెలిపారు .
ఈ కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన కార్యక్రమం .దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రారంభించడం చాలా ఉన్నత వర్గాలను ఆలోచింపజేసేలా ఉందని కావున అందులో భాగంగా ఇవాళ తాను మొక్కలు నాటానని చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రశాంత్ జీవన్… జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఇక గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నల్గొండ కలెక్టర్‌ని అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్.