- Advertisement -
రాష్ట్రంలోని బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పరిపాలనాధికారి యూ రఘురాంశర్మ శుక్రవారం తెలిపారు. వివేకానంద విదేశీ విద్యా పథకం, బ్రాహ్మణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికసహాయ పథకం (బెస్ట్), రామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 20 వరకు పొడిగించినట్టు తెలిపారు.
- Advertisement -