పవన్‌ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్‌..!

248
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుంచి సినిమాకు సంబంధించి రోజుకోవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

మేలో సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జరుగుతుండగా మార్చి నుండి చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టాల‌ని చిత్ర నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఫ‌స్ట్ లుక్ మార్చి 2న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

వ‌కీల్ సాబ్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఈ చిత్రానికి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని కూడా వేగంగా జ‌రుపుకుంటుంది.