- Advertisement -
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగత నిర్ణయమని దీనిపై తానేమి స్పందించనన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని.. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం తగదన్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే ఉందదని.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణలు జరగతావున్నాయని తలసాని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి తలసానిని సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
- Advertisement -