మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”మా ‘ఒక్కడొచ్చాడు’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. హీరో విశాల్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందిన సినిమా ఇదే. డిసెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో 2,100 థియేటర్లలో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌తో చాలా లావిష్‌గా నిర్మించిన ఈ చిత్రం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ” అన్నారు.
విశాల్, తమన్నా, ప్రైమ్‌స్టార్ జగపతిబాబు, సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: డా. చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్: ఆర్.కె. సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.