సల్మాన్‌ కు లవ్‌ ప్రపోజల్..

138
salman

మోస్ట్ బ్యాచిలర్‌ హీరో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి గురించి బాలీవుడ్‌ లో ఎప్పటి నుంచో జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సల్లుబాయ్ ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లతో ప్రేమయాణం నడిపినా..ఎవరితోనే పెళ్లికి మాత్రం సిద్ధం కాలేదు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి మాత్రం సల్లు భాయ్ పెళ్లిపై షికార్లు చేస్తున్నాయి. గత ఏడాది కాలంగా లవ్ ఎఫైర్ నడిపిస్తున్న గర్ల్‌ ఫ్రెండ్‌ లూలియా వంతూర్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై రుమేనియా భామ క్లారిటీ ఇచ్చింది. సల్మాన్‌ పుట్టిన రోజునాడు నా ప్రేమనంతా ఇవ్వడంతోపాటు, గౌరవాన్ని కూడా ఇచ్చేస్తాను’ అంటూ లూలియా వార్తలో నిలిచింది.

salman

ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్‌ సంబంధాన్ని గురించి సల్మాన్‌ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావించింది.  ఓ అవార్డు కార్యక్రమానికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం అందుకున్న ఈ అమ్మడు సల్మాన్‌కు త్వరలోనే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఈ నెల (డిసెంబర్‌) 27న కండల వీరుడు సల్మాన్‌ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ అక్కడి మీడియా ప్రశ్నించగా ‘ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు ఇచ్చేస్తాను’ అంటూ చెప్పింది.

salman

ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో సల్మాన్‌ కూడా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే తన ప్రేమ విషయాన్ని సల్మాన్‌ కు వివరించేలా కనబడుతోంది. మరి ఈ ప్రేమతోనే సల్లు పెళ్లి పీటలు ఎక్కుతాడో లేదో చూడాలి.