పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుష్క..!

704
anushka shetty
- Advertisement -

అరుంధతి , బాహుబలి , రుద్రమదేవి , భాగమతి వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన బ్యూటీ అనుష్క. ప్రస్తుతం స్వీటి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు.

మాధవన్‌ హీరోగా రెండు అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తాజాగా నిశ్శబ్దం మూవీలో నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ప్రేమ, పెళ్లి అంటూ తన గురించి తరచూ వదంతులు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. తన గురించే ఇలా ఎందుకు వదంతులు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెళ్లి గురించి తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అని తేల్చిచెప్పింది. వాళ్లు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతడినే పెళ్లిచేకుంటానని స్పష్టం చేసింది. దీంతో ఇకపైనైనా అనుష్కపై రూమర్స్‌ని ఆపుతారో లేదో వేచిచూడాలి.

- Advertisement -