ఏపీ సీఎం చంద్రబాబుకు రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు.. అధికారులతో పాలన జరుపుతున్నాడని…అది మంచిది కాదన్నారు. జగన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరగదని ఆనాడు టీడీపీలో చేరానన్నారు. పిలిస్తే వెంటనే రావడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాదన్నారు. పయ్యావుల కేశవ్ లాంటి వారికి విలువలేకపోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారల రాజ్యం వద్దని బాబుకు చాలాసార్లు సూచించాన్నారు. చంద్రబాబు ఒక్కడి వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదన్నారు.
చంద్రబాబు ఎమ్మెల్యేలను పట్టించుకోవటం మానేశాడని…ఎమ్మెల్యేలు కింది స్ధాయి వారిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఆరుశాతం ఓట్లు వస్తే…మరో మూడు ఓట్లు ఎమ్మెల్యేల ద్వారా వస్తేనే గెలుస్తామన్నారు. చంద్రబాబు కష్టపడుతున్నారని… గెలిస్తే ఆయన వల్లనే గెలుస్తాం….లేదంటే ఇంటికి పోతామన్నారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని తెలిపారు. చంద్రబాబుపై జేసీ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.