ఈనెల 28న మంగ్లీ ‘స్వేచ్ఛ’

568
mangli
- Advertisement -

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ ను పోషించింది. అన్ని పనులనూ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ దీన్ని నిర్మించారు.

నిర్మాత ఆంగోత్‌ రాజునాయక్‌ మాట్లాడుతూ.. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్‌, వినోదంమేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండతో పాటు పు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు.

దర్శకుడు కెపీఎన్‌. చౌహన్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడపిల్లను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిుస్తుంది. హాస్య నటుడు చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడని తెలిపారు.

- Advertisement -