- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. ఇప్పటికే సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనగా తాజాగా సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన టీఆర్ఎస్‌వీ, మైనారిటీ విద్యార్ధుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరి 17న సీఎం బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇనాయత్ అలీ బక్రీ,గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,టీఆర్ఎస్‌వీ నాయకులు కిశోర్,రోహిత్ శర్మ,సికిందర్ షా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -