దేశంలో జాతీయ పార్టీలు లేవు: కేటీఆర్

463
ktr
- Advertisement -

దేశంలో ఉంది ప్రాంతీయ పార్టీలేనని…జాతీయ పార్టీలు లేవన్నారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్లో మాట్లాడిన కేటీఆర్..తెలంగాణ 5 సంవత్సరాలలో భారత ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 2లక్షల 70వేల కోట్లు చెల్లిస్తే.. తెలంగాణ తిరిగి వచ్చింది 1లక్ష 15 వేల కోట్లు మాత్రమేనన్నారు. దాదాపు 1లక్ష 60వేల కోట్ల వ్యత్యాసం ఉందని …వాస్తవాలు ఇలా ఉంటే మేము ఏదో ఇచ్చాము అని కేంద్ర పెద్దలు చెప్పడం మంచిది కాదన్నారు

కేంద్రం మరింత ఉదరపూర్వకంగా ఉండాలన్నారు. నిజమైన పని జరిగేది రాష్ట్రాలలో.. అందుకు రాష్ట్రాలను మరింత బలోపేతం చేయాలన్నారు. సీఏఏ అంశంలో కేంద్రంతో విభేదించామని…ఒక పార్టీ గా, రాష్ట్రంగా ఎందుకు విభేదిస్తున్నామో విడమరిచి చెప్పామన్నారు.

చట్ట ప్రకారం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని…కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయి నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ లో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం కూడా చూశాం..తాము ఏదో ఇచ్చాము తెలంగాణకు.. ఇవ్వకూడనిది ఏదో ఇచ్చాము.. మాకు హక్కుగా రావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్టు సీతారామన్ చెప్పారు.. తీవ్రంగా కండిస్తున్నాం.. ఇది సవ్యం కాదన్నారు.

అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఉనికి కొల్పోతున్నాయని… దక్షిణాది లో కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి లేదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయని…సీఎం కేసీఆర్ చెప్పే నిజమైన ఫెడరల్ స్పూర్తితో ఈ దేశం నడిచే రోజు వస్తుందన్నారు.

- Advertisement -