యావత్ భారత్ తెలంగాణ వైపు చూస్తోంది

374
Puvvada Ajay Kumar minister
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో యావత్ భారత్ తెలంగాణ వైపు చూస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం భక్తరామదాసు కళా క్షేత్రంలో పంచాయితీ రాజ్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి కార్యక్రమం పై ప్రజా ప్రతినిధుల సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీ నామా నాగేశ్వరరావు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్జి , రాములు నాయక్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , కలెక్టర్ ఆర్వీ కర్ణన్ , జడ్పీ సీఈవో ప్రియాంక పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వమే స్పూర్తి గా తీసుకొంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ, రైతు బంధు పథకాలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. మిషన్ భగీరథ లో తెలంగాణ కి మనం రూ.40 వేలకోట్లు పెట్టకున్నాం .. కానీ దేశం మొత్తానికి కేంద్రం పెట్టింది 20వేల కోట్లే మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదన్నారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి మెచ్చుకున్నా కేంద్రం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయింది .. రెండేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ తో ఖమ్మం జిల్లా పచ్చబడుతుంది. చదువుకున్న వాళ్లు చాలా మంది సర్పంచ్ లు గా ఉన్నారు..పల్లెలను అభివృద్ది పథంలో నడిపించి పచ్చదనం, పరిశుభ్రత సాధించాలని కోరారు.

- Advertisement -