నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం: కేటీఆర్

376
ktr
- Advertisement -

ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం అన్నారు. ఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై మాట్లాడిన కేటీఆర్‌..గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని కానీ ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని తెలిపారు.

నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామన్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ క్రాంతి పథంలో నడుస్తామని చెప్పారని కానీ అలా జరగడం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో నోట్ల రద్దుకు మద్దతుగా తీర్మానం చేశాం. కానీ నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆటంకం కలిగించిందన్నారు.

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమన్నారు. తెలంగాణలో రాహుల్‌ను, మోడీని ప్రజలు తిరస్కరించారు. జాతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందన్నారు. కేటీఆర్‌. కేంద్రానికి తెలంగాణ ఎంతో తోడ్పాటును అందించిందన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు మాత్రం మద్దతు లభించడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -