నక్సలైట్ గా రామ్ చరణ్?

372
ram charan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేట్ లో జరుగుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఈసినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది. ఈమూవీలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 40 నిముషాలు ఉండనుందట. ఇందులో చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈమూవీ కోసం చరణ్ 40రోజులు కేటాయించాడని సమాచారం.

దేవాదాయశాఖ భూముల కుంభకోణం నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో చిరంజీవి ఎండోమెంట్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇక ఈమూవీలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. చిరుకు జోడిగా త్రిష నటించనుంది. ఈమూవీకి ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అక్టోబర్ లో ఈమూవీని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -