పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీకి ఆసక్తికర టైటిల్

344
Pawan Kalyan Krish
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో భారీ విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈమూవీని దిల్ రాజు తో పాటు బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నివేధా ధామస్, అనన్య లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈమూవీతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుండగా..గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

ఇటివలే క్రిష్ మూవీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈరెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు పవన్ . ‘పింక్​’ రీమేక్​ వేసవి కానుకగా మే 15న రిలీజ్ చేయడానికి సన్నద్దం చేస్తుండగా..క్రిష్‌ మూవీని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ , క్రిష్ మూవీ గురించి ఓ అప్ డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ‘విరు’ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు పవన్. ఈ నేమ్‌ మీదగా టైటిల్ వచ్చేలా విరూపాక్షి అన్న టైటిల్‌ను ఫైనల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

- Advertisement -