ఫోర్భ్స్ జాబితాలో ఫిదా బ్యూటీ..!

553
sai pallavi
- Advertisement -

ఫిదా’ సినిమాతో అందరినీ ఫిదా చేసింది.. సాయి పల్లవి. తన డ్యాన్స్‌తో అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ జోరుగా దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది. ముప్పై ఏళ్లలోపు వయసున్న వారు తమ తమ రంగాల్లో సాధించిన విజయాలకు గాను ఈ ఘనత దక్కుతుంది.

ఇందులో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, డిజైన్, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, సైన్స్ రంగాలకు చెందిన యువతీ యువకులను ఎంపిక చేస్తారు. మొత్తం ముప్పై మందికి ఈ జాబితాలో ఫోర్బ్స్ సంస్థ చోటును కల్పించింది. కాగా, సాయి పల్లవికి తన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది.

sai-pallavi

ఈ జాబితాలో ఆమెకు 27వ స్థానం దక్కింది. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సాయి పల్లవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్న ఈ తమిళ భామ తాజాగా తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’, శేఖర్ కమ్ముల సారథ్యంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది.

- Advertisement -