తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వరంగల్‌లో మైండ్ ట్రీ కేంద్రం ఏర్పాటుకు ఎల్ అండ్ టీ సంస్ధ అంగీకరించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో లైన్ ప్రారంభం తర్వాత మరో శుభవార్త చెబుతున్నా. వరంగల్ నగరంలో మైండ్ ట్రీ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ సలహాకు ఎల్ అండ్ టీ సీఈవో అండ్ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అంగీకరించారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అభివృద్ధి వీకేంద్రీకరణలో భాగంగా వరంగల్,కరీంనగర్,నిజామాబాద్,ఖమ్మంలో ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలు సైయెంట్, టెక్ మహీంద్రాలను ప్రారంభించారు.
After the joyous occasion of opening the JBS-MGBS Metro line, another piece of good news to share
Delighted to announce that L&T CEO & MD Sri S. N. Subrahmanyan Garu has agreed to Hon’ble CM Sri KCR Garu’s suggestion to open a centre of @Mindtree_Ltd at Warangal City 😊
— KTR (@KTRTRS) February 7, 2020