టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు సహా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బాహుబలి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమాగా ఇరుగు పొరుగు భాషల్లోనూ క్రేజు నెలకొంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందుతోంది. అయితే ఈ మూవీ నుండి తాజా ఓ ఫోటో లీక్ అయి వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ మీద ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా, అందుకు సంబంధించిన ఓ ఫొటో ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. ఓ అడవిలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేశాడు. ఇది చిత్రంలోని ఓ కీలక దృశ్యం కావడంతో దీనిని ఎవరు లీక్ చేసి ఉంటారనే దానిపై చిత్ర బృందం ఆరా తీయడం ప్రారంభించింది. ఇక లీక్ అయిన ఫొటోలో ఎన్టీఆర్, ఒంటిపై ఎటువంటి దుస్తులూ లేకుండా, కేవలం చెడ్డీతో పులితో ఫైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఎన్టీఆర్ కు సంబంధించిన దృశ్యాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి.