- Advertisement -
పసిడి ధర వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 39,110 నుంచి రూ.38,770కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గుదలతో రూ.42,670 నుంచి రూ.42,450కు చేరుకుంది. పసిడితో పాటు వెండీ ధర కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.500 పతనమై రూ.49,000 నుంచి రూ.48,500కు చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో పసిడి ధర క్షీణించింది. అంతేకాకుండా అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
- Advertisement -