బన్నీ జర్నీ: గంగోత్రి నుంచి వైకుంఠపురము వరకు

434
allu arjun
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరపై ఆరంగేట్రం చేసిన హీరో అల్లు అర్జున్. గంగోత్రితో ప్రారంభమైన బన్నీ జర్నీ…అల వైకుంఠపురము వరకు అలల ఎగిసిపడుతూ దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ తనతో సినిమాలు చేసిన దర్శకులు అందరికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

బన్నీని వెండితెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పార్టీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌…రాఘవేంద్ర రావు మరియు త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఫోటో స్పెషల్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. గంగోత్రి నుండి అల వైకుంఠపురంలో వరకు నా సినిమా జర్నీ అని ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -