నిర్భయ దోషులకు వారం గడువు..

190
Nirbhaya Convicts
- Advertisement -

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. కానీ ఈశిక్ష రెండు సార్లు వాయిదాపడ్డింది. దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులోని దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ కు అన్ని అవకాశాలు ముగిశాయి. అతడి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా విఫలమైంది.

మరోవైపు అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దానిపై నిర్ణయం వస్తే నిర్భయ దోషులు ఉరి అమలుపై స్పష్టత రానుంది. తాజాగా ఈ కేసులో దోషుల ఉరిశిక్ష అమలు జాప్యం కావడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రివ్యూ పిటిషన్లపై జాప్యం జరిగిందని పేర్కొంది.

నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్భయ దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని తెలిపింది. స్టే తొలగించాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చామని, ఆ గడువు ముగిసిన తర్వాతే వారి ఉరితీతకు సంబంధించిన విచారణ మొదలు అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు సదరు పిటిషన్లను కొట్టివేసింది.

- Advertisement -