జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో..ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

324
ktr

మూడో విడత మెట్రో కారిడార్‌ జేబీఎస్-ఎంజీబీఎస్‌ పై రివ్యూ నిర్వహించారు మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తలసాని,మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు హైదరాబాద్ మెట్రో రైల్,జీహెచ్‌ఎంసీ,పురపాలక శాఖ అధికారులు,నగర పోలీస్ కమిషనర్, ఎల్ అండ్ టి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇక ఈ నెల 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్‌ను ప్రారంభిచనున్నారని చెప్పారు. మూడో కారిడార్ ప్రారంభంతో దేశంలోనే హైదారాబాద్ మెట్రో రైల్ రెండవ అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా అవతరిస్తుందన్నారు.

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ (పిపిపి) మెట్రోరైల్ ప్రాజెక్ట్ అని దీని నిర్మాణంలో అందుకున్న మైలురాళ్లు, అవార్డుల వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమయిన చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను మంత్రి అదేశించారు.