హ్యాపీ బర్త్ డే…శేఖర్ కమ్ముల

361
shekar kammula
- Advertisement -

అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే దర్శకుడు ఎవరంటే ‘శేఖర్ కమ్ముల’ అని చెప్పవచ్చు. “ఫిదా” మూవీతో సంచలనం సృష్టించిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవిలతో లవ్ స్టోరీ సినిమా తీస్తున్నారు. ఇక ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక కథనం.

2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శేఖర్ కమ్ముల.. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదాలతో మెప్పించారు. తన కెరీర్‌లో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారు.

సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. ప్రజలు మెచ్చే ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు శేఖర్ కమ్ముల తీయాలని కోరుకుందాం..

- Advertisement -