రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భతమైన స్పందన వస్తుంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటారు డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ పద్మజ. ఈసందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.
అనంతరం డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని హరిత తెలంగాణను చేయాలనే ఉద్దేశ్యంతో పదికోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఇప్పటివరకు నాలుగు కోట్ల మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. గత కొద్ది రోజులుగా భూమి పై విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం తో పాటు కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లి పోయేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతి ఒక్కరు పాల్గొని వారి వంతుగా మొక్కలు నాటాలని వారు కోరారు . ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు.