వెల్లింగ్టన్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరిగింది. అయితే ఈమ్యాచ్ కూడా సూపర్ ఓవర్ జరగడం విశేషం. సూపర్ ఓవర్ లో భారత్ విజయం సాధించింది. వరుసగా రెండోసారి సూపర్ ఓవర్‌లో కూడా న్యూజిలాండ్ ఓటమి పాలైంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది.
దీంతో సూపర ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో భాగంగా తొలత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. 6బంతుల్లో న్యూజిలాండ్ 13 పరుగులు మాత్రమే చేసింది. 14పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగారు. కేఎల్ రాహుల్ మొదటి బంతికి సిక్స్ కొట్టాడు. రెండవ బంతి ఫోర్ కొట్టాడు. మూడవ బంతికి అవుట్ అయ్యాడు. ఆతర్వాత సంజయ్ శాంసన్ గ్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ చాలా సింపుల్‌గా 2 రన్స్ తీశాడు. ఐదో బాల్‌కు ఫోర్ కొట్టి న్యూజిలాండ్ గడ్డ మీద భారత్‌కు వరుసగా నాలుగో టీ20 విజయాన్ని అందించాడు.కాగా 4-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.