- Advertisement -
హైదరాబాద్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు ఎన్నారై సునీత విజయ్. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో మొక్కలు నాటగా విజయ్ కోస్నా,నర్సింగరావు ఎనుగంటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడు పటోళ్ల నరేందర్ రెడ్డి,తెలుగు కమ్యూనిటీ నాయకుడు బాల వేణుగోపాల్ రెడ్డి,తెలంగాణ అసోసియేషన్ యుకే అధ్యక్షుడు కంది పవిత్ర రెడ్డిలకు ఛాలెంచ్ ఇచ్చారు.
ఎంపీ సంతోష్ కమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు.
- Advertisement -