మేడారం జాతర విశేషాలు తెలిపిన అమితాబ్..

355
amithabh
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర,తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే జాతర కోసం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు జాతరకు వచ్చే వారి కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ఇక మేడారం జాతరలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గిరిజన నేతలకు ఆహ్వానం పంపిన అధికారులు జాతర విశేషాలు తెలిపేందుకు ప్రత్యేక వీడియోని రూపొందించారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాష‌లలో రూపొందిన ఈ వీడియోని రూపొందించగా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల వీడియోకి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గాత్రాన్ని అందించారు. జాత‌ర విశేషాల‌ని జాతీయ‌, అంతార్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు ఇలా వీడియోని రూపొందించిన‌ట్టు మంత్రి స‌త్య‌వ‌తి రాఠోడ్ తెలిపారు.

ఫిబ్రవరి 6న చిలుకలగుట్టపై సమ్మక్కను తీసుకొచ్చి ద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. ఫిబ్రవరి 7న సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజును గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

- Advertisement -