తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు..

489
- Advertisement -

దేశీయంగా ఈ రోజు పెట్రోల్, డీజిలు ధరలు తగ్గుదలను నమోదు చేశాయి.ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న మాత్రం స్థిరంగా కొనసాగాయి. మళ్లీ ఈ రోజు తగ్గాయి. పెట్రోల్ ధర 18 పైసలు, డీజిల్ ధర 21 పైసలు చొప్పున దిగొచ్చాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ముడి చమురు ధరలు తగ్గాయి.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.19 శాతం తగ్గుదలతో 62.54 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.34 శాతం క్షీణతతో 55.98 డాలర్లకు తగ్గింది.

Petrol-

ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

దేశంలోని వివిధ నగరాలలో గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..

-హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.38, డీజిల్ ధర రూ.73.99గా ఉంది.
-అమరావతిలో పెట్రోల్‌ రూ.78.94, డీజిల్‌ ధర రూ.73.21
-విజయవాడలో పెట్రోల్ ధర రూ.78.58,. డీజిల్ ధర రూ.72.87
-ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.74.65, డీజిల్ ధర రూ.67.86
-ముంబయిలో పెట్రోల్ ధర రూ.80.25, డీజిల్ ధర రూ.71.15కు తగ్గింది.

- Advertisement -