- Advertisement -
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంక్రాంతి సంబురాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఆఫీసు ఆవరణలో ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సంబరాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌పైన పతంగులు ఎగురవేశారు.
ఈ సందర్భంలో మంత్రి ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు.. శ్రీనివాస్ రెడ్డి, నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సైప్లె కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -