`ప్రేమ‌ పిపాసి’ ట్రైలర్ విడుదల

587
prema Papasi
- Advertisement -

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి` .పి.ఎస్‌.రామ‌కృష్ణ (ఆర్ .కె ) ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ముర‌ళీరామ‌స్వామి ( ఎమ్ ఆర్ ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిపిఎస్‌, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షివ‌ర్మ‌ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ సంక్రాంతి కానుకగా ఇటీవల దర్శకుడు మారుతి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ…‘‘పియస్‌ రామకృష్ణ నిర్మాతగా, మురళిరామ స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమపిసాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉంది. కొత్త టీమ్‌ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. జీపీయస్‌ కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోగా నటించాడు. ట్రైలర్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సినిమా కూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్న నమ్మకం ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ…‘‘మారుతి మా సినిమా ట్రైలర్ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రెండీగా, యంగేజింగ్‌గా ట్రైలర్ ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.
.

హీరో జిపియస్‌ మాట్లాడుతూ..‘‘మారుతి ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ హీరోలా నటించావని కాంప్లిమెంట్‌ ఇవ్వడంతో ఇన్ని రోజు పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కినంత ఆనందంగా ఉంది. దీనికి కారణం మా దర్శక నిర్మాతలు’’ అన్నారు.

దర్శకుడు మురళిరామస్వామి మాట్లాడుతూ…‘‘మా సినిమా ట్రైలర్ మారుతి గారి చేతుల మీదుగా రిలీజ్‌ కావడం చాలా హ్యాపీ. ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఎంతో కష్టపడి యూనిట్‌ అందరం సినిమా చేశాం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా నిర్మాత పూర్తి సహకారం వల్లే. మా హీరో జిపియస్‌ ఈ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌, లుక్‌ పరంగా ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. నలుగురు హీరోయిన్స్‌ నటించారు. ట్రెండ్‌కి అడ్వాన్స్‌డ్‌గా సినిమా తీశాం. లవ్ ప్రస్తుతం ఎంతో కమర్షియల్‌గా తయారైంది. ఒక జెన్యూన్‌ లవ్‌ వెతికేవాళ్లు, ఎలా ప్రేమించకూడదో తెలుసుకోవడానికి మా సినిమా చూడొచ్చు’’ అన్నారు.

- Advertisement -