నితిన్ భీష్మ.. సండే సర్ ప్రైజ్

511
bheeshma
- Advertisement -

యంగ్ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి.

సంక్రాంతి పండుగ కానుకగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు నితిన్. ఈనెల 12వ తేదిన ఉదయం 10 గంటలకు ఈమూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. మ‌రోవైపు నితిన్.. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

- Advertisement -