పసిడి ధర కాస్త దిగివచ్చిందనుకునేలోపే మళ్లీ కొండెక్కింది.. ఎంత తగ్గిందో.. అంతకు ఎక్కువే పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారా స్థాయికి చేరుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పసిడి ధర ఆకాశాన్ని అంటింది.
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.42,860, విజయవాడలో రూ.41,350, విశాఖపట్నంలో రూ.42,060, చెన్నైలో రూ.40,920గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,270, విజయవాడలో రూ.38,300, విశాఖపట్నంలో రూ.38,690, చెన్నైలో రూ.38,970గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.51,000, విజయవాడలో రూ.50,000, విశాఖపట్నంలో రూ.49,100, చెన్నైలో రూ.51,100 వద్ద ముగిసింది.
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.