ఢిల్లీలోని జేఎన్ యూలో ముసుగులు వేసుకుని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు విద్యార్దులపౌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈదాడికి నిరసనగా విద్యార్దులు యూనివర్సీటి ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ దీపిక పదుకొణే వెళ్లి విద్యార్ధులని కలిసి బంద్‌కి మద్దతు పలికారు. ఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్‌తో పాటు ఆమె పలువురిని కలిశారు.
ఈ నేపథ్యంలో ఆమెపై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనవరి 10న విడుదల కానున్న చపాక్ మూవీని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చపాక్ మూవీలో దీపిక పదుకొణే నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్విట్టర్‌లో ‘బాయ్‌కట్ ఛపాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు చపాక్ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నవారు క్యాన్సల్ చేసుకోవాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరికొంత మంది తాము బుక్ చేసిన టికెట్లు క్యాన్సిల్ చేసినట్లు ఫోటోలు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ‘బాయ్‌కట్ ఛపాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.ఛపాక్ చిత్రం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రం లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత నేపథ్యంలో రూపొందింది. ఈవిషయంపై దీపిక ఎవిధంగా స్పందిస్తుందో చూడాలి.