దర్శకుడు మారుతికి గిఫ్ట్‌గా రేంజ్ రోవర్..

545
Director Maruthi
- Advertisement -

ప్రతిరోజూ పండగే సినిమా బ్లాక్ బాస్టర్ హిత్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు మారుతి. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం భారీ విజయాన్ని సాధించింది. అటు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో కూడా ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో మారుతికి తన స్నేహితుడు వంశీ నుంచి అదిరిపోయే గిఫ్ట్ అందింది. తన స్నేహితుడి నుంచి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా అందుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన మారుతి నీ లాంటి స్నేహితుడు ఉంటే ప్రతిరోజు పండే అంటే పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించాడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.భలే భలే మగాడివోయ్ సినిమాతో రూట్ మార్చిన మారుతి సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో సత్తాచాటాడు. తాజాగా సాయిధరమ్ తేజ్‌తో ప్రతిరోజూ పండగే మూవీని తెరకెక్కించి హిట్ కొట్టాడు.

- Advertisement -