ఎన్నికలు అంటేనే కాంగ్రెస్  భయపడుతోంది

423
Vemula-Prashanth-reddy
- Advertisement -

ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని అన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేమని తెలిసే సాకులు వెతుక్కుంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని, కానీ ఎన్నికలను అడ్డుకునేందుకు కేసులను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమని, టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెల్సి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం ఆ పార్టీ చేసిందన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె,పట్నం తేడా లేకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని మున్సిపాలిటీలకు వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.,స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జెడ్పి పీఠాలు కైవసం చేసుకున్న విధంగానే మెజారిటీ మున్సిపాల్టీలు,కార్పొరేషన్ లు కైవసం చేసుకుంటామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.

- Advertisement -