ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ కోసం గద్దర్ పాట?

600
RRR GAddar
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలీవియా,అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ ఈమూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ 70శాతం పూర్తైంది. కాగా ఈసినిమాను జూలై 30,2020న విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈమూవీకి సంబంధించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాట పాడబోతున్నారని ..ఈ మేరకు ఇటీవల రాజమౌళి, గద్దర్ కలిసి చర్చించుకున్నారని తెలిసింది.

కొమరం భీమ్ పాత్ర ఈసినిమాలో ఉండటంతో ఆయనకు సంబంధించి గద్దర్ తో ఓ జానపద గేయం రాయిస్తున్నట్లు సమాచారం. కాగా గద్దర్ రాసిన పాటలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈవార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -